Tuesday 26 July 2016

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడో వేతన సంఘం సిఫార్సులపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య (సిసిజీఈడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నాగేశ్వరరావు చెప్పారు. 2016, ఆగస్టు 1 నుంచి మూలవేతనం పెంపు మాత్రమే అమలవుతోందని తెలిపారు. అలవెన్సులు పాతవే కొనసాగిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వేతన పెంపుదల పట్ల ఉద్యోగులు సంతృప్తికరంగా లేరని చెప్పారు. ఇంటి అద్దె భత్యం పెంచుతామన్నారు కానీ ఇప్పుడు అమల్లోకి రావడం లేదన్నారు. ప్రస్తుతం అమలు కాకపోవడం వల్ల 7 నెలలు ఇంటి అద్దె భత్యం నష్టపోతామని చెప్పారు. తాము మూలవేతనం రూ.26 వేలు ప్రతిపాదిస్తే రూ.18 వేలు మాత్రమే నిర్ణయించడం నిరాశకు గురిచేసిందని తెలిపారు. అలవెన్సులు, ఇతర అంశాలపై ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం నియమిస్తుందని, నాలుగు నెలల తర్వాత ఆ కమిటీ నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ఆ తర్వాతే అలవెన్సులు పెరుగుతాయని అన్నారు. ఇలా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను నెరవేర్చాలని, అలవెన్సులు త్వరగా అమలయ్యేటట్టు చూడాలని కోరారు.

No comments:

Post a Comment